
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భీభత్సమైన క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరో, ఒక పేరు కాదు పవన్ అంటే ఓ ప్రభంజనం అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన చివరి సినిమా ‘గోపాల గోపాల’. ఆ సినిమా తర్వాత ఆయన మేకప్ వేసుకోలేదు. గత రెండు నెలలుగా ఆయన జనసేన పార్టీ రాజకీయ కార్య కలాపాల్లో బిజీగా ఉన్నాడు.
కానీ తాజాగా ఆయన సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం, పవన్ కలయన్ మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడని, అది కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలిపారు. చాలా కాలంగా ఇదిగో, అదిగో అంటున్న గబ్బర్ సింగ్ 2 ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇది కాకుండా దాసరి నిర్మించనున్న సినిమాని కూడా కుదిరినంత వరకు ఈ సంవత్సరంలోనే ఫినిష్ చేసి రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయం ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ఇదే కనుక నిజం అయితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు.
ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేక ఒకదాని తర్వాత ఒక దాని ఫాస్ట్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తా పవన్ అభిమానులను ఎంతో థ్రిల్ అయ్యేలా చేసింది.