పెద్ది యాక్షన్ : నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ చేశామంటున్న యాక్షన్ కొరియోగ్రాఫర్..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చేయబోయే యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి చిత్ర యాక్షన్ కొరియోగ్రాఫర్ నభాకాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తన మెంటర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాలో ఒక పోలీస్ స్టేషన్ ఎపిసోడ్‌ను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారని.. ఇక ఇందులో వచ్చే ఒక ప్రత్యేకమైన రెజ్లింగ్ సీక్వెన్స్ కోసం తాము బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్‌ను సంప్రదించామని.. ఈ సినిమాలో జాతీయ స్థాయిలో జరిగే రెజ్లింగ్ పోటీలను చూపిస్తున్నామని.. ఆ సీన్లను చాలా సహజంగా డిజైన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా, ప్రేక్షకులు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక ఫుల్-ఆన్ మాస్ రెజ్లింగ్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉండబోతోందని.. అలాగే, చిత్రంలో వచ్చే మరొక రెజ్లింగ్ ఎపిసోడ్‌ను తెరకెక్కించడం వారికి అత్యంత సవాలుతో కూడుకున్న విషయంగా మారిందని నభాకాంత్ తెలిపారు. ఇలా ఈ సినిమాలోని యాక్షన్ ఎపీసోడ్స్‌పై నభాకాంత్ హైప్ క్రియేట్ చేయడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version