మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే యూఎస్ మార్కెట్ సహా ఇతర ఓవర్సీస్ దేశాల్లో బుకింగ్స్ స్టార్ట్ చేసుకున్న పెద్ది సాలిడ్ బుకింగ్స్ ని అయితే కనబరుస్తుంది. అలా లేటెస్ట్ గా యూఎస్, నార్త్ అమెరికా ప్రాంతంలో భారీ బుకింగ్స్ ని ఇపుడు సినిమా క్రాస్ చేసింది.
అక్కడ ఏకంగా 20 వేలకి పైగా టికెట్స్ ఇపుడు బుక్ అయినట్టు డిస్ట్రిబ్యూస్టర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో సాలిడ్ హోల్డ్ లో పెద్ది దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. అలాగే ప్రీమియర్స్ ఫైనల్ వసూళ్లు అక్కడ వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
#PEDDI Momentum Is Through The Roof 💥 ⚡
North America Premieres 20000+ Tickets Sold and Counting 💥🔥
North America By @PrathyangiraUS, Grand PREMIERES On 3rd JUNE 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/bbAwjfUVXo
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 27, 2026


