‘పెద్ది’కి ఇదే గోల్డెన్ ఛాన్స్.. అడ్వాంటేజ్ ని వాడుకుంటారా!

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదలని ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు జూన్ 25 అని ప్రకటించారు. అయితే దీనితో పాటుగా జూన్ 4 డేట్ కూడా అంతకు ముందు పరిశీలనలో ఉందనే టాక్ కూడా ఉంది.

కానీ ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితులు తారుమారు అయ్యాయి. పెద్ది ఫిక్స్ అయ్యి ఉన్న సమయంలో అఖిల్ లెనిన్ వెనక్కి వెళ్లేది లేదని వారు చెప్పేసారు. కానీ జూన్ 4కి మాత్రం పెద్ది సినిమాని దింపాల్సిందే అని అభిమానులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. పైగా జూన్ 4 డేట్ లో ఉన్న కన్నడ భారీ సినిమా టాక్సిక్ ఈ రేస్ నుంచి తప్పుకోవడంతో “పెద్ది” చిత్రానికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పొచ్చు.

వేసవి సెలవులు ఎలా లేదన్నా జూన్ 10 వరకు ఉంటాయి. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకి బాగా కలిసి వస్తుంది. ఇక దీనితో పాటుగా జూన్ మొదటి వారం అయినా కూడా నెల రోజుల సమయం కూడా ఈజీగా ఉంది. సో కరెక్ట్ గా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకున్నా ఆన్ టైం మంచి హైప్ లో ఈ సినిమా రావచ్చు. సో మేకర్స్ ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారా లేక మిస్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version