నైజాంలో ‘పెద్ది’కి తప్పని టెన్షన్.. ఇదే జరిగితే ఏపీలో ఫ్యాన్స్ కి గుడ్, బ్యాడ్ రెండూనూ

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “పెద్ది” గ్రాండ్ గా విడుదలకి ఇప్పుడు రాబోతుంది. నేడు మేకర్స్ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకుంటున్నారు. అయితే అన్ని పెద్ద సినిమాల్లానే పెద్ది సినిమాకి కూడా ఇపుడు నైజాం మార్కెట్ కి సంబంధించి టెన్షన్ పట్టుకుంది. ఏపీలో ఆల్రెడీ టికెట్ ధరల హైక్ లు, ప్రీమియర్ షోస్ తాలూకా టైమింగ్స్ కూడా ఖరారు అయ్యిపోయాయి.

కానీ నైజాంలో మాత్రం పెద్ది సినిమాకి ఇంకా ఎలాంటి పర్మిషన్స్ రాలేదు. అసలు ప్రీమియర్స్ ఉంటాయా లేదా? టికెట్ ధరల హైక్స్ వస్తాయా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే తెలంగాణాలో దాదాపు హైక్స్, స్పెషల్ షోస్ కష్టమే అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. అలాగే పెద్ది మొదటి ఆట జూన్ 4 ఉదయం 8 గంటల ఆట తోనే ఉంటుందని టాక్.

ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఏపీలో మెగా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మంచి విషయం ఏంటంటే వారికి ఏ రోజు ముందే పెద్ది సినిమా చూసేసే అవకాశం ఉంటుంది. సో సంబరాలు ముందే మొదలవుతాయి. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒకవేళ నైజాంలో టికెట్ ధరల హైక్ లేకపోతే ఏపీలో మాత్రమే అదనపు రేట్లతో సినిమా చూడాల్సిన పరిస్థితి.

సో నైజాంలో సాధారణ రేట్ లోనే సినిమా అందుబాటులో ఉంటే ఏపీలో మాత్రం ఎక్స్ట్రా భారం ఆడియెన్స్ మీద కొనసాగుతుంది. సో ఇదే ఫార్మాట్ కొనసాగుతుందా లేక రెండు చోట్లా షోస్, టికెట్ ధరలు సమానంగానే మొదలవుతాయా అనేది వేచి చూడాలి.

Exit mobile version