తెలుగు సహా తమిళ్ లో కూడా మంచి ఆదరణ ఉన్న అతి తక్కువమంది స్టార్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు. తన లేటెస్ట్ చిత్రం కరుప్పు అటు తమిళ్ లో వీర భద్రుడు ఇటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యి వరల్డ్ వైడ్ గా 300 కోట్లకి పైగా గ్రాస్ ని సొంతం చేసుకొని దుమ్ము లేపింది. అయితే ఈ సక్సెస్ ని చాలా పర్శనల్ గా తీసుకున్న సూర్య తన సంగీత దర్శకుడు, ఎడిటర్ అలాగే సినిమాటోగ్రాఫర్ లకి వరుసగా మూడు ఖరీదైన లగ్జరీ కార్లని కేబహుమతిగా ఇచ్చేసారు.
దీనితో వీరికే ఇంత ఖరీదైన బహుమతులు ఇస్తే తన కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకునికి అంతకు మించి ఏం ఇస్తాడు అని అభిమానులు ఆ గిఫ్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో ఫన్నీగా చార్టెడ్ ఫ్లైట్ ని సూర్య అన్న ఇచ్చేస్తాడు అంటూ ఫన్నీ జోక్స్ కూడా వేసుకుంటున్నారు. సో వారికే అలాంటి గిఫ్ట్స్ ఇస్తే తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హిట్ అండ్ కంబ్యాక్ ని ఇచ్చిన దర్శకుడు ఆర్జే బాలాజీకి సూర్య ఏం ప్లాన్ చేశాడో చూడాలి మరి.
