మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ మరియు ప్రామిసింగ్ రిపోర్ట్స్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.
ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊహించని రేంజ్‌లో రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికా ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం ఏకంగా 1.57 మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నార్త్ అమెరికాలో ఈ స్థాయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. రాబోయే వీకెండ్‌లో కూడా ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.
