గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా దర్శకుడి పుట్టినరోజును పురస్కరించుకుని, రామ్ చరణ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ.. బుచ్చిబాబు కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చరణ్ రఫ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ అభిమానులను ఆకర్షిస్తోంది.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి.
