‘డెకాయిట్’ పై ‘పెద్ది’ రివ్యూ వైరల్!

లేటెస్ట్ గా వచ్చి మంచి హిట్ అయ్యిన చిత్రమే ‘డెకాయిట్’. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో పెద్ది హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు.

అయితే ఈ సినిమాపై రామ్ చరణ్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. ఈ సినిమాని తాను చాలా ఎంజాయ్ చేసినట్టు రామ్ చరణ్ చెబుతున్నాడు. అడివి శేష్ హరిగా ఒక సాలిడ్ అండ్ మర్చిపోలేని పెర్ఫామెన్స్ ని అందించాడు అని తెలిపారు. అలాగే మృణాల్ ఠాకూర్ తన రోల్ కి డెప్త్ తీసుకొచ్చింది అని అలాగే నటుడు అనురాగ్ కశ్యప్ ఇతర నటీనటులు స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ లు అందించారు.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ అండ్ టీం ఒక అద్భుతమైన నిర్మాణ విలువలతో కూడిన సినిమా అందించినందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. దీనితో డెకాయిట్ పై తన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.

Exit mobile version