‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్స్ ?

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రచార కంటెంట్ కారణంగా ఇప్పటికే భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో పలువురు నటీమణులు కనిపించనున్నారు.

ఇందుకోసం నటీమణుల ఎంపికపై దర్శకుడు బుచ్చిబాబు దృష్టి సారించారట. ఒకవేళ ఈ వార్త నిజమైతే, స్టార్ హీరోయిన్స్ ఈ సాంగ్ లో కనిపిస్తే.. కచ్చితంగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట.

Exit mobile version