అక్కడ పెద్ది ప్రభంజనం.. అప్పుడే ఆ మార్క్ క్రాస్..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే దర్శకుడు బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు.

​ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో అప్పుడే రికార్డు స్థాయి క్రేజ్ కనిపిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ అప్పుడే 300K డాలర్ మార్కును దాటేసాయి. ఇక సోమవారం విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ట్రైలర్ లాంచ్ అనంతరం మేకర్స్ పలు భారీ ఈవెంట్లను కూడా ప్లాన్ చేస్తున్నారు.

​వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, మరియు బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఈ సినిమా ఆడియో మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version