హీరోగా మారడానికి సన్నద్ధం అవుతున్న నిర్మాత తనయుడు ?

shiva kandukuri
రాజ్ కందుకూరి ‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా భారీ విజయం సాధించారు. ఐతే రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేయబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటికే రాజ్ కందుకూరి తన తనయుడి కోసం ఓ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట.

కాగా ఆ స్క్రిప్ట్ కు ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అయితే పూర్తి న్యాయం జరుగుతుందని రాజ్ కందుకూరి భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన దర్శకుడ్ని వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. శివ కందుకూరి నటనతో పాటు డాన్స్ కూడా నేర్చుకున్నారు. అన్ని కుదిరితే శివ కందుకూరి త్వరలోనే హీరోగా మారడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం సాధ్యమైనంత త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

Exit mobile version