విడుదలకు ముందురోజు దీపికా పదుకొణె నటించిన ‘ఛపాక్’ సినిమా చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. దీపికా పాత్రకు స్ఫూర్తి అయిన లక్ష్మీ అగర్వాల్ కు న్యాయవాదిగా వ్యవహరించిన లాయర్ అపర్ణా భట్ కోర్టుకి ఎక్కారు. అనేక ఏళ్ళు లక్ష్మీ తరుపున న్యాయ పోరాటం చేసిన నాకు సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడకపోవడం దారుణం అని ఆ లాయర్ ఢిల్లీ కోర్ట్ ని ఆశ్రయించారు. లాయర్ అపర్ణాభట్ ఈ విషయాలను ఫేస్‌బుక్‌లో వివరించారు. అలాగే ఈ సినిమా ప్రదర్శన ఆపివేయాలంటూ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు అభ్యర్థించానని తెలిపారు. విడుదలకు ముందు రోజు ఇలాంటి వివాదాలు సినిమా నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నాయి.
లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హీరోయిన్ దీపికా పదుకొనే స్వయంగా నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ చాలా గట్టిగా నిర్వహించారు దీపికా పదుకొనె. తన పుట్టినరోజు యాసిడ్ అట్టాక్ బాధితులతో జరుపుకున్న ఆమె, ఆ మేకప్ తో ముంబై నగరంలో పబ్లిక్ ప్రదేశాలలో సంచరించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షో ల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వస్తుంది.
