సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘లింగ’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా ఓ తమిళ నిర్మాత ఈ సినిమా రిలీజ్ ని ఆపివేయాలని చెన్నై హై కోర్టులో పిటీషన్ వేసారు.
అసలు విషయంలోకి వెళితే.. తమిళ చిత్ర నిర్మాత రవి రత్నీమ్ 2013 లో ‘ముల్లై వనం 999’ అనే సినిమాని తీసాడు. ఈ సినిమా కథాంశమే లింగ కథాంశం అని, మా స్టొరీ ని కాపీ కొట్టారని రవి ఆరోపించాడు. అంతే కాకుండా ఈ రోజు చెన్నై హై కోర్టులో లింగ సినిమా రిలీజ్ ఆపివెయ్యాలని పిటీషన్ వేసాడు.
మరి ఈ విషయంపై దర్శకుడు కెఎస్ రవికుమార్ మరియు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. రజినీకాంత్ ద్విపాతాభినయంలో కనిపించనున్న ఈ మూవీలోఅనుష్క , సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఎయార్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియోని నవంబర్ 16న రిలీజ్ చేయనున్నారు.
