సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165వ చిత్రం ‘పెటా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా నుండి ‘మరణ మాస్’ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన కొద్దీ క్షణాల్లోనే ఈ లిరికల్ వీడియో వైరల్ గా మారింది. ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం పాడారు.
ఇక ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను కూడా డిసెంబర్ 9న జరుగనుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా విడుదలకానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
