
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ విడుదలకు సమయం దగ్గర పడడంతో ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈరోజు విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సమాచారం. జనవరి 6న ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఈ వేడుకకు రజినీ తోపాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రజినీ లుక్ ఆకట్టుకుంటుంది.
అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 11న తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.