ఫోటో మూమెంట్: బాలయ్య, చంద్రబాబు కుటుంబాల బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైరల్!

Nandhamri 1

ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో చేస్తున్న 111వ సినిమా ఇది కాగా దీనిపై గట్టి హైప్ నెలకొంది. అయితే బాలయ్య ఓ పక్క నటుడుగా ఇంకోపక్క రాజకీయ నాయకునిగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తాజాగా తమ కుటుంబం నుంచి ఓ బ్యూటిఫుల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో అభిమానుల నడుమ వైరల్ గా మారింది.

బాలయ్య మనవడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలో బాలయ్య మరియు కుటుంబీలు అంతా పాల్గొనడం వైరల్ గా మారింది. బాలయ్య, తన భార్య, కూతురు నారా బ్రాహ్మణి అలాగే తన బావ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా నారా లోకేష్, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి కలిసి కనిపించిన ఈ అందమైన ఫోటో ఇరు కుటుంబాల అభిమానులని భావోద్వేగపరుస్తుంది. మరి ఈ ఫొటోలో బాలయ్య మంచి చార్మింగ్ లుక్స్ లో కనిపిస్తూ తనదైన ప్రెజెన్స్ తో ప్రత్యేకత చూపించారు. ఇలా ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version