ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక్క నటన మాత్రమే కాదు, ఆయనలో ప్రపంచానికి తెలియని ఎన్నో అద్బుత కళలు ఉన్నాయి. పూర్వాశ్రమంలో అధ్యాపకుడి(లెక్చరర్)గా పని చేశారు. ఆయనలో శిల్పకళ కూడా దాగి ఉంది. ఇటీవల బంక మట్టితో బ్రహ్మానందం రవీంద్రనాథ్ ఠాగూర్ శిల్పం రూపొందించారు. ఈ ఫోటోను తన అఫీషియల్ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. గంటలో 15,000 లైకులు సొంతం చేసుకున్న ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
