ఫోటో మూమెంట్ : ఈ హీరోలెవరో గుర్తించండి?

heros
ముద్దు ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ చిన్నారులను గుర్తు పట్టారా ? ఇద్దరూ ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్లుగా వెలుగుతున్నవారే.. ఇద్దరూ అన్నాదమ్ముల్లు కూడా. ఒక్క తమిళ సినీ పరిశ్రమలోనే కాక, తెలుగు పరిశ్రమలోనూ ఈ ఇద్దరు అందరికీ సుపరిచితులే! ఎప్పుడో తమ చిన్నపుడు తీయించుకున్న ఫోటో ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతోన్న ఫోటోల్లో ఇదొకటి. ఇద్దరి మధ్యా రెండేళ్ళ తేడా మాత్రమే. ఇప్పటికైనా ఆ హీరోలని గుర్తు పట్టారా ?

అవును.. వాళ్ళిద్దరూ తమిళ సూపర్ స్టార్లు సూర్య, కార్తీలే! గజిని సినిమా ద్వారా తెలుగులో పాపులరైన సూర్య.. ఆ తర్వాత వరుసగా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ.. తెలుగు హీరోలతో సమాంతరంగా మార్కెట్‌ను పెంచుకున్నాడు. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా విభిన్న చిత్రాలతో, సరికొత్త మ్యానరిజమ్స్‌తో ఇటు తెలుగులో, అటు తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అన్నయ్య నటనను తమ్ముడూ, తమ్ముడి తెలివిని అన్నయ్యా ఎప్పుడూ మెచ్చుకుంటూ కనిపించే ఈ అన్నాదమ్ముల కాంబినేషన్ తమిళ పరిశ్రమలో చూడముచ్చటగా కనిపిస్తుంది. మరి ఈ అన్నదమ్ములిద్దరూ తెరపై ఒకేసారి ఎప్పుడు కనిపిస్తారా అన్నది అభిమానుల ఆసక్తికర, ఆశావహ ప్రశ్న!

Exit mobile version