మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. ఈ జూన్ లో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని ఇపుడు మేకర్స్ దాదాపు పూర్తి చేసేస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి సాంగ్ చిత్రీకరణ చేస్తుండగా ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ లో సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా తాము చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
ఇక ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్ పిక్స్ ని షేర్ చేశారు. మరి ఇందులో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా ఇద్దరు ఎంతో క్లోజ్ గా హ్యాపీ మూడ్ లో నవ్వుతూ కనిపిస్తున్నారు. దీని బట్టి సినిమా ఎంత బాగా వచ్చిందో ఇద్దరు తమ వర్క్ అండ్ అవుట్ పుట్ పరంగా ఎంత ఆనందంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
దీనితో ఈ పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వృద్ధి సినిమాస్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలానే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.
