ఫోటో మూమెంట్: తన ‘శివాజీ’తో ఉమాదేవి.. మళ్ళీ రిపీట్ చేస్తున్నారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రికార్డు బ్రేకింగ్ హిట్ చిత్రాల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో చేసిన మొదటి చిత్రం ‘శివాజీ’ కూడా ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన అప్పటికి యంగ్ హీరోయిన్ గా పేరొందిన శ్రేయ నటించింది. పైగా సినిమాలో ఆమెది ఎంతో కీలక పాత్ర కూడా. ఇలా ఆ చిత్రంతో ఇద్దరి జంట ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది.

శివాజీ, ఉమాదేవిగా అదరగొట్టిన వీరు మళ్ళీ ఆ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ రాలేదు. అయితే దాదాపు 19 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారా అనే టాక్ ఇపుడు మొదలైంది. తాజాగా తన రజినీకాంత్ తో కలిసి ఆమె దిగిన ఫొటో ఆమె షేర్ చేసుకుంది. ఇక ఇందులో రజినీకాంత్ తన కొత్త చిత్రం ‘ధర్మన్’ లుక్స్ లో కనిపించడంతో ఆమె ఈ సినిమాలో ఉందా అనే టాక్ ఇప్పుడు మొదలైంది. సో ఇలా తమ మధ్య దిగిన ఈ స్పెషల్ పిక్ వైరల్ గా మారింది.

Exit mobile version