ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా దగ్గరే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ నుంచి వచ్చిన గత చిత్రం పుష్ప 2 ది రూల్ ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్ దేశంలో కూడా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రమోషన్స్ నిమిత్తం అల్లు అర్జున్, రష్మిక మందన్నాలు కూడా వెళ్లారు.
కానీ సుకుమార్ మాత్రం మిస్ అయ్యారు. అయినప్పటికీ సుకుమార్ కి జపాన్ ఆడియెన్స్ నుంచి ప్రేమ ఆగలేదు. అక్కడ నుంచి తన కోసం వచ్చిన లెటర్స్ ని చదువుతూ సుకుమార్ పోస్ట్ చేసిన పిక్ మంచి మూమెంట్ గా మారింది. జపాన్ నుంచి వచ్చిన లెటర్స్ చదువుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అని సినిమాకి బౌండరీలు లేవు, కేవలం ఎమోషన్ మాత్రమే అంటూ జపాన్ ఆడియెన్స్ కి సుకుమార్ తన ధన్యవాదాలు తెలిపారు.
