
సాయిధరమ్ తేజ్, రెజినా లు జంటగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని ‘ఏ’ సర్టిఫికేట్ ని సంపాదించుకుంది. ఈ చిత్రం నవంబర్ 14న విడుదలకానుంది
ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో జగపతిబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు