డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’.

Pilla-Nuvvuleni-Jeevitham
హీరోగా పరిచయం కావడం కోసం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు. తన కష్టం వృధాగా పోలేదు. ఆ ఎదురుచూపులు మంచి ఫలితాన్ని అందించాయి. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మెగా అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సినిమాకు మౌత్ పబ్లిసిటీ కూడా బాగుంది. ఈ వీకెండ్ లో సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మెజారిటీ స్క్రీన్ లలో ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఓ కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం గొప్ప విషయమే. బాగా ప్రమోట్ చేయడం, మెగా వారసుడు కావడంతో కలెక్షన్స్ బాగున్నాయి.

సాయి ధరమ్ తేజ్ సరసన రెజినా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలకమైన మైసమ్మ పాత్రలో నటించారు. రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అల్లు అరవింద్, దిల్ రాజుల సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version