‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

Untitled 7 1 1

​నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, యాక్షన్ అంశాలతో పాటు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

​ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో నటించడం విశేషం. ఆమెకు జోడీగా నవీన్ చంద్ర ఒక బలమైన పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో నటించగా, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి దాదాపు 52 మంది సీనియర్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

​దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, ప్రేమ, పగ, మంచి-చెడుల మధ్య సాగే హైడ్ అండ్ సీక్ డ్రామా ఇది అని పేర్కొన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ సహకారంతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Exit mobile version