నాకు రాజకీయాల గురించి పెద్దగా ఏమి తెలియదు. మనకు తెలియని విషయాలు, పెద్దగా పరిజ్ఞానం లేని అంశాలలో ప్రవేశించకూడదనేది నా ఫిలాసఫీ. అందుకే నాకు రాజకీయాలు వద్దు అనుకుంటున్నాను. అని అన్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. తండ్రి హరికృష్ణ, బాబాయి బాలకృష్ణ రాజకీయాలలో ప్రజాసేవ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ మాత్రం సినిమాలలో కొనసాగాలని కోరుకుంటున్నారు.
పదేళ్ళ తర్వాత ‘పటాస్’తో ఘనవిజయం అందుకున్న ఈ హీరో సంతోషంగా ఉన్నారు. గతంలో చేసిన తప్పుల నుండి చాలా నేర్చుకున్నానని చెప్తున్న కళ్యాణ్ రామ్, ప్రతి కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు ఉండడం సహజం. చివరగా, మేమంతా ఒకటే కుటుంబం అని చెప్పారు. అవకాశం లభిస్తే బాలకృష్ణ 100వ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తానని తెలిపారు.
