ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డేలు కనిపించనున్నారు. వీరి పాత్రలకు గాను కూడా మంచి స్పందన లభించింది.
అయితే ఈ చిత్రంలో పూజా చేసే రోల్ కాస్త ప్రత్యేకమైనది అని ముందు నుంచి వింటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ ఎలాగో పూర్తి కావస్తుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రంలో ఎన్ని రోజులు షూట్ లో పాల్గొందో కూడా పూజా చెప్తుంది. ప్రస్తుతం 87వ రోజు షూట్ ను కంప్లీట్ చేసి ప్యాకప్ చేసుకున్నట్టుగా చెప్తుంది.
మొత్తానికి ఈ పాన్ ఇండియన్ సినిమా కోసం పూజా గట్టిగానే కష్టపడుతుంది. మరి ఈ చిత్రంలో ఆమెకు దర్శకుడు రాధా కృష్ణ ఎలాంటి రోల్ డిజైన్ చేసారో చూడాలి. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
