మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిన పూర్ణ

poorna_mahesh1
తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీకి పరిచయమైన ప్రతి హీరోయిన్ కి స్టార్ హీరోలతో పనిచేయాలని ఉంటుంది. అది కూడా హన్డ్సం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించాలని కుదిరితే ఒక సాంగ్ అన్నా చేయాలని ఉంటుంది. అలాంటి అవకాశమే ‘అవును’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పూర్ణకి దక్కింది. అసలు విషయంలోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

ఈ సినిమాలో కథానుసారంగా వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం పూర్ణని సెలెక్ట్ చేసారు. అన్ని సినిమాల్లోలా ఇదొక ఐటెం సాంగ్ కాదు, ఈ పాటలో ట్రెడిషనల్ డాన్స్ స్టెప్స్ ఉంటాయి. అందుకోసమే కథక్ లో ఆరితేరిన పూర్ణని ఈ సాంగ్ కోసం ఎంచుకున్నారు. అలా ఈ బొద్దుగుమ్మ మహేష్ కలిసి స్టెప్స్ వేసే ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే ఈ పాటని షూట్ చేసే అవకాశం ఉంది.మహేష్ బాబుకి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2015 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version