సర్దార్ నుండి తప్పుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్

సర్దార్ నుండి తప్పుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్

Published on Sep 14, 2015 10:07 PM IST

pawan-kalyan-jayan
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. లక్ష్మి రాయ్ ఒక ముఖ్యపాత్రలో మెరవనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి నియమించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కొన్ని కారణాల వలన చిత్రం నుండి తప్పుకున్నారట. ఇప్పుడు ఈ పనికోసం ఆర్థర్ విల్సన్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు ఈరోస్ సంస్థలు కూడా భాగస్వాములు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు