టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా తెలుగు తెర పై నవ్వుల వర్షం కురిపిస్తోన్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ‘వెన్నెల కిషోర్’. గత కొన్ని సంవత్సరాలుగా వెన్నెల కిషోర్ లేని తెలుగు హిట్ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ప్రతి సినిమాలో నటిస్తూ.. తన మార్కు కామెడీతో హాస్యప్రియులకు హాట్ ఫేవరెట్ మారాడు వెన్నెల.
కాగా ఆదివారం రాత్రి జరిగిన సంతోషం 17వ సౌతిండియా అవార్డ్స్‌లో వెన్నెల కిషోర్‌కి పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య స్మార్మక అవార్డ్ దక్కింది. కాగా తనకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అలాగే ఈ అవార్డుని అనారోగ్యంతో కన్నుమూసిన కమెడియన్ వేణు మాధవ్ కి అంకితమిచ్చాడు వెన్నెల కిషోర్. గతంలో దర్శకులు బ్రహ్మానందం, అలీ, సునీల్ వంటి స్టార్ కమెడియన్స్ కొరకు తమ చిత్రాలలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసేవారు. నేటి దర్శకులు వెన్నెల కిషోర్ కోసం అలా ఓ ప్రత్యేకమైన పాత్రను రాసుకొంటున్నారు.
