ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి ‘సాహో’ !

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లోని ఖరీదైన లొకేషన్లలో జరుగుతోంది. ‘బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అన్ని భాషలు పరిశ్రమల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడ రూపొందిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఉత్తరాదిన రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఒప్పందానికి సంబందించి టి-సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ ప్రభాస్ ను, చిత్ర నిర్మాతల్ని కలవడం కూడ జరిగింది.

శ్రద్దా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా మందిర బేడీ, టిన్ను ఆనంద్ వంటి హిందీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version