తరుణ్ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ !

తరుణ్ హీరోగా నటించిన ‘ఇది నా లవ్ స్టోరి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రమేష్ గోపి ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. గతంలో రమేష్ గోపి పలు చిత్రాలకు మాటలు రాసారు. అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ విజయ్ సంగీతం అందించాడు.

ఇటీవల తరుణ్ పలు కళాశాలల్లో పర్యటించడం, ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ హీరోల జాబితాలో నిలబడి కుటుంబ ప్రేక్షకుల ఆదరణను పొంది ఉండటంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉండొచ్చు. ఈ సినిమా తరువాత తరుణ్ మంచి సబ్జెక్టుతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version