పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో వస్తున్న’శంభో శంకర’ !

shambho shankara

కమెడియన్ గా మంచి స్థాయిలో ఉంటూనే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షణించుకోనున్నాడు షకలక శంకర్. ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శంభో శంకర’. అన్ని పనుల్ని ముగించుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

శ్రీధర్.ఎన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వై.రమణా రెడ్డి, సురేష్ కొండేటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమను వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదని, ఖచ్చితంగా సక్సెస్ సాధించే చిత్రమని అన్నారు.

అలాగే ఈ సినిమా శంకర్ కెరీర్ కు ఎంతగానో ఉపకరిస్తుందని, ఈ సీజన్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని కూడ అన్నారు. సాయి కార్తిక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా.కె.ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ నెల 29న చిత్రం పెద్ద స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version