మాస మహారాజ రవితేజ మరియు అక్కినేని నాగ చైతన్య పోరుకు సిద్దమవుతున్నారు, కానీ మీరనుకుంటున్నట్టు నువ్వా నేనా అని తేల్చుకునే పోరు కాదు.. ఇది బాక్స్ ఆఫీసు పోరు. అవును వీరివురూ ఒకేరోజు తమ సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర డీ కొట్టుకోవడానికి సిద్దమవుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తున్నారు. బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, అదీ కాక ఇప్పటికే విడుదలైన టీజర్స్ మాస్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్య ఫుల్ క్లాస్ లుక్ లో చేస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా చైతన్యకి మరో హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.
ఒకటి క్లాస్ సినిమా – ఒకటి మాస్ సినిమా కానీ ఇద్దరూ ఒకే రోజు తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి బాక్స్ ఆఫీసు దగ్గర క్లాస్ గెలుస్తుందా? మాస్ గెలుస్తుందా? లేక వేటికవే తన సత్తాని చాటుకొని విజయాల్ని అందుకుంటాయా అనేది చూడాలి..
