బాబీ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ 2’..?

pawankalyan-bobby
మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన ‘పవర్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది. రచయిత కోన వెంకట్ బాబీ పేరుని పవన్ కు సూచించారట.

రోజుకొక గాసిప్ బయటకొస్తుంది. పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు దర్శకుడు ఎవరు..? ఈ విషయంలో సినిమా పరిశ్రమ ప్రముఖులతో పాటు పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంపత్ నంది దర్శకుడిగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాపై ప్రతి రోజు ఒక గాసిప్ వినబడుతుంది. నిర్మాతల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ పుకార్లు షికారు చేస్తాయి.

Exit mobile version