ఒకేసారి రెండు బిగ్ అప్డేట్స్ రివీల్ చేసిన ప్రభాస్ టీం.!

Prabhas Deepika

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం అనే చెప్పాలి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు సరైన అప్డేట్స్ ను మాత్రం మేకర్స్ వదులుతున్నారు.

అలా కొన్ని రోజుల కితం దర్శకుడు చెప్పినట్టుగానే ఈ జనవరి 29న అప్డేట్ ను రివీల్ చేశారు. అది కూడా ఒకేసారి రెండు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తన మొదటి చిత్రం “మహానటి” సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన మిక్కీ జె మేయర్, అలాగే అదే సినిమాకు అవుట్ స్టాండింగ్ విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ డానీ శాంచెజ్ లోపెజ్ లు ఈ చిత్రానికి కూడా తమ వర్క్ ను అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఇలాంటి భారీ ప్రాజెక్ట్ కు వారిపై ఎంత నమ్మకం లేకపోతే ఇస్తారు. మరి ఈ భారీ చిత్రానికి ఎలాంటి వర్క్ అందిస్తారో తెలియాలి అంటే కొన్నాళ్ల వరకు ఆగాల్సిందే. మరి ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు 500 కోట్ల మీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version