మహీంద్ర నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్

మహీంద్ర నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్

Published on Aug 13, 2015 7:35 PM IST

prabhas1
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాలో శివుడుగా, బాహుబలిగా కనిపించిన ఇండియన్ సినిమా ఆడియన్స్ ని మెప్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా సక్సెస్ తో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ మరియు గుర్తింపుతో ప్రభాస్ కి పలు బ్రాండ్స్ నుంచి తమ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయమని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ ఏ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయని ప్రభాస్ ఆచితూచి బ్రాండ్స్ ని సెలక్ట్ చేసుకుంటున్నాడు.

తాజాగా ప్రభాస్ సన్నిహితుల నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మొదటగా మహీంద్ర కంపెనీ వెహికల్స్ కి నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు సమాచారం. మహీంద్ర కంపెనీలో బాగా సేల్స్ అయిన వెహికల్ XUV 500. దీనికి అడ్వాన్స్ వెర్షన్ గా వస్తున్న మహీంద్ర న్యూ XUV 500ని రిలీజ్ చేసారు. త్వరలోనే ఈ వెహికల్ కోసం ప్రభాస్ యాడ్ షూట్ లో పాల్గొననున్నాడు. మొదటి సారి ఓ నేషనల్ లెవల్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న విషయంలో ప్రభాస్ చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా యాడ్ షూట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని సమాచారం.

పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం హాలిడే లో ఉన్నాడు. అక్టోబర్ మిడిల్ నుంచి బాహుబలి 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు