ప్రభాస్ స్టార్డంకి ప్రూఫ్.. వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ తో ‘రాజా సాబ్’

Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన హారర్ ఫాంటసీ చిత్రమే “ది రాజా సాబ్”. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రానికి ఒకింత మిక్స్డ్ టాక్ దక్కింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ ని ఈ సినిమా సాధించడం విశేషం.

The Raja Saab day 1 collection – రాజా సాబ్ కి డే 1 వచ్చిన వసూళ్లు

అయితే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ స్టార్డం ఏ పాటిది అనేది ఈ సినిమాకి వచ్చిన డే 1 వసూళ్లు చెబుతున్నాయి. ఇంత మూమెంట్ లో కూడా ఈ సినిమా 100 కోట్లకి పైగా ఓపెనింగ్స్ రావడం అనేది ప్యూర్ ప్రభాస్ స్టార్డం అనే చెప్పాలి. మేకర్స్ ఈ చిత్రానికి 112 కోట్ల గ్రాస్ మొదటి రోజు వసూలు అయ్యినట్టు తెలిపారు. మరి ఇండియన్ సినిమా దగ్గర హారర్ ఫాంటసీ చిత్రాల్లో ఇది హైయెస్ట్ నెంబర్ అని కూడా మేకర్స్ చెబుతున్నారు.

Prabhas 100 crore Openings records – ఇండియన్ సినిమా దగ్గర ఒకే ఒక్కడు

ముఖ్యంగా ప్రభాస్ ఖాతాలో మరో 100 కోట్ల ఓపెనింగ్ సినిమాగా నిలిచి సెన్సేషన్ ని రాజా సాబ్ సెట్ చేసింది. పోస్ట్ బాహుబలి చిత్రం ఒక్క రాధే శ్యామ్ మినహా వచ్చిన అన్ని సినిమాలతో కూడా ప్రభాస్ 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోకి లేని యునీక్ రికార్డుని తన ఖాతాలో డార్లింగ్ వేసుకున్నాడు. ఇక డే 2 కూడా మంచి బుకింగ్స్ కనిపిస్తుండగా లాంగ్ రన్ లో మంచి నెంబర్ దగ్గరే ఈ సినిమా ఆగే అవకాశం ఉంది.

Exit mobile version