The Raja Saab : నాచె నాచె సాంగ్.. ముగ్గురు హీరోయిన్లను డామినేట్ చేసిన ప్రభాస్..!

The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ చిత్రంతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి.

ఇక (The Raja Saab) ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ పెప్పీ డ్యాన్స్ నెంబర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డిస్కో డ్యాన్సర్ మూవీలోని ‘నాచె నాచె’ సాంగ్‌ను రీమిక్స్ చేసిన ఈ పాట అదిరిపోయింది. ప్రభాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ పాటలో మెరిసిపోయారు. తమదైన ఎనర్జీతో వారు చేసిన డ్యాన్స్ ఈ పాటకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ పాటలో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్స్‌తో పాటు అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా, అందరూ ప్రభాస్ చేసే డ్యాన్స్‌నే లైక్ చేస్తున్నారు.

అంతలా తన డ్యాన్స్ మూమెంట్స్‌తో మైమరపించిన ప్రభాస్ ఈ సినిమాలో ఇంకా ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version