పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కూడా ఒకటి. పాన్ ఆసియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
రీసెంట్ గానే దర్శకుడు ఈ సినిమా 40 శాతం పూర్తి చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక లేటెస్ట్ గా షూట్ కి సంబంధించి మరో అప్డేట్ వినిపిస్తుంది. దీని ప్రకారం డార్లింగ్ హీరో స్పిరిట్ కొత్త షెడ్యూల్ లో రేపు జూలై 22 నుంచే అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కొత్త షెడ్యూల్ సుమారు నెల పాటుగా ఉంటుందని కూడా టాక్.
సో లాంగ్ షెడ్యూల్ పై ప్రభాస్ పై సాలిడ్ విజువల్స్ ని సందీప్ తెరకెక్కిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
