ప్రభాస్, రాజమౌళిల మధ్యన స్నేహం ఎలాంటిదో అందరికీ తెలుసు. కేవలం రాజమౌళి మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులందరితో ప్రభాస్ చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ సాన్నిహిత్యంతోనే కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా పరిచయమైన ‘మత్తు వదలరా’ చిత్రం కోసం తనవంతు సహకారం అందిస్తున్నారు రెబల్ స్టార్.
మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్ నుండి టైమ్ కేటాయించి సినిమాను వీక్షించారు. చిత్రం ఆయనకు బాగా నచ్చిందట. అందుకే ఇంకాస్త వీలు చూసుకుని శ్రీ సింహ, చిత్ర సంగీత దర్శకుడు, కీరవాణి మరొక కుమారుడు కాలభైరవ, డైరెక్టర్ రితేష్ రానాలతో ప్రత్యేకంగా మాట్లాడారట. వారి సంభాషణకు సంభందించిన వీడియో ఇవాళో, రేపో విడుదల కానుంది. సో.. ఈ రకంగా ప్రభాస్ సినిమా ప్రమోషన్లకు ఇంకాస్త బూస్ట్ ఇవ్వనున్నారు. కొద్దిరోజుల క్రితం రాజమౌళి సైతం చిత్ర బృందంతో ఇలాగే ప్రత్యేక చర్చలో పాల్గొని ప్రమోషన్లకు తన వంతు సహకారం అందించారు.
