మల్టీ స్టారర్ మూవీలో ప్రభాస్, రామ్ చరణ్, రానా.?

rana-ram-charan-prabhas

ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం అనేది సినీ పరిశ్రమలో చాలా కామన్ గా జరిగే విషయం. కానీ ఒక భాషలో ఇంకా రిలీజ్ కాని సినిమాని వేరే భాషలో రీమేక్ చెయ్యాలనుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సంఘటన టాలీవుడ్ లో చోటు చేసుకోనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ – యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా కలిసి నటించిన లతెత్స్ మల్టీ స్టారర్ మూవీ ‘బ్రదర్స్’. ఈ సినిమాలో హాలీవుడ్ లో హిట్ అయిన ‘వారియర్’ సినిమాకి రీమేక్. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది.

ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ మిర్చందని ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోస్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా లను పరిశీలిస్తున్నాడు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రామ్ ‘ఇప్పటికే ప్రభాస్, రానా, రామ్ చరణ్ లని కలిసి ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం అడిగానని’ తెలిపాడు. ఈ ముగ్గురు స్టార్స్ లో ఇద్దరు మాత్రమే ఫైనల్ అవుతారు. ఈ చిత్ర నిర్మాత తెలుగులోనే కాకు తమిళ రీమేక్ కోసం కూడా అన్నదమ్ములైన సూర్య – కార్తీ మరియు విక్రమ్ లను కూడా కలిసినట్లు సమాచారం.

మరోవైపు ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపించి బ్లాక్ బస్టర్ కొట్టారు. మరోవైపు రామ్ చరణ్ – రానాలు చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్.. సో ఎవరైనా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. అభిమానుల్లో క్రేజ్ ని పెంచేసే ఈ మూవీ అధికారిక ప్రకటన కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version