ప్రస్తుతం ఇండియా మొత్తం చర్చించుకుంటున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తను హీరోగా నటించిన బాహుబలి సినిమా ఇండియా మొత్తం రిలీజ్ అవ్వడమే కాకుండా అందరూ గర్వించే సినిమాగా నిలిచి కలెక్షన్స్ వరద సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడు మరియు అమరేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో కలిసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రభాస్ చేసిన కామెంట్స్ ఈ వార్తలని నిజం చేసేలా ఉన్నాయి. నిన్న తమిళంలో బాహుబలి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ మీట్ లో ప్రభాస్ మాట్లాడుతూ ‘ ఒక మంచి ప్రాజెక్ట్ తో తనని అప్రోచ్ అయితే కచ్చితంగా తమిళ సినిమాలో నటిస్తాను. షూటింగ్ విశేషాలను చెబుతూ సత్యరాజ్ తలపై కాలు పెట్టే సీన్ చేసేటప్పుడు చాలా భయపడ్డానని’ తెలిపాడు. ముఖ్యంగా తమిళ్ లో తనని ఆదరించినందుకు ప్రభాస్ చాలా హ్యాపీగ ఉన్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ కూడా అతమిలంలో నటించాలనే ఆసక్తి ఉందని ఇది వరకే తెలియజేశాడు. కావున ప్రభాస్ ని త్వరలో తమిళంలో కూడా చూడచ్చు.
