ప్రభాస్ ఇష్టపడే బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎవరంటే.?

prabhas-depika
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఒక సినిమా కోసం మరే సినిమా చేయకుండా రెండున్నరేళ్ళు ఒక సినిమాకే కాల్షీట్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ అలాంటి రేర్ ఫీట్ చేసిన టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మిర్చి తర్వాత కేవలం బాహుబలి సినిమా కోసం ప్రభాస్ వర్క్ చేసారు. రెండున్నరేళ్ళు ఎంతో కష్టపడి చెక్కిన ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దాన్తూ ప్రభాస్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

ముంబైలో కూడా ఈ సినిమ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకి నచ్చిన, తను వర్క్ చెయ్యాలనుకునే హీరోయిన్ గురించి తెలియజేశాడు. మీరు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తో జోడీ కట్టాలి అనుకుంటున్నారు అని అడిగితే ప్రభాస్ వెంటనే ‘నాకు దీపిక పడుకొనే తో సినిమా చేయడమంటే చాలా ఇష్టం. అలాగే నాకు మున్నాభాయ్ సీరీస్, 3 ఇడియట్స్, పికె సినిమాల దర్శుకుడు రాజ్ కుమార్ హిరని వర్క్ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే తన సినిమాలో నటించాలని ఉందని’ ప్రభాస్ తెలిపాడు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన బాహుబలి సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

Exit mobile version