తన హీరోయిన్ కు ప్రభాస్ స్పెషల్ విషెష్.!

Prabhas Deepika Padukone

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టేకప్ చేసిన పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏదన్నా ఉంది అంటే అది నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా అనే చెప్పాలి. దీనితో పాటు మరిన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఫ్యాన్స్ పల్స్ మాత్రం ఎక్కువగా ఈ సినిమా కోసమే కొట్టికుంటుంది.

అయితే ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని స్కై ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి అదిరే క్యాస్టింగ్ ను తీసుకుంటున్నారు. అలా ఈ సినిమాకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారు.

మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అన్ని సినీ వర్గాల నుంచి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సందర్భంలో ప్రభాస్ తన హీరోయిన్ గా స్పెషల్ విషెష్ తెలిపారు. ఆమెను “గార్జియస్ సూపర్ స్టార్” అంటూ ప్రభాస్ దీపికా పదుకొనెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

Exit mobile version