Spirit : ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సరికొత్తగా.. నెవర్ బిఫోర్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్‌టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’(Spirit), ‘స్పిరిట్’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘కల్కి 2898 ఏడి’, ‘సలార్’ సీక్వెల్స్‌లో కూడా ఆయన నటించనున్నాడు.

అయితే, ఈ సినిమాల్లో ‘స్పిరిట్’ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో చేయనున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఖరీదైన సెట్లను నిర్మించిన మేకర్స్, త్వరలో ప్రభాస్(Prabhas) ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ సన్నివేశం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ఫైట్‌లో ప్రభాస్ ఒంటరిగా రెండు వందలకు పైగా ఫైటర్లను ఢీ కొట్టనున్నాడట. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందట.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Exit mobile version