‘రాజా సాబ్’లో ప్రభాస్ తాండవం.. తన ఎఫర్ట్స్ కి స్పెషల్ మార్క్స్!

The Raja Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ క్రేజీ లైనప్ లో అందరినీ సర్ప్రైజ్ చేసిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు మారుతీతో ప్లాన్ చేసిన సినిమానే అని చెప్పాలి. ఒక హారర్, ఫాంటసీ సినిమా ప్లాన్ చేసిన ఈ సినిమాని దర్శకుడు మారుతీ అండ్ కో తెరకెక్కించగా ఈ సినిమా గట్టి నెగిటివ్ లో మొదలై మారుతిపై కూడా మంచి అంచనాలు సెట్ చేసుకునే విధంగా విడుదలకి వచ్చింది.

అయితే ప్రభాస్ అసలు ఎందుకు ఈ సినిమా ఎంచుకున్నారు అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది. ప్రభాస్ తాలూకా ఎఫర్ట్స్ డెఫినెట్ గా ఇందులో వింటేజ్ డార్లింగ్ ని చూపిస్తాయి. తన కామెడీ టైమింగ్ మాత్రమే కాకుండా నటన పరంగా కూడా ఇందులో ప్రభాస్ షాకిచ్చాడు. క్లైమాక్స్ పోర్షన్ లో సీన్స్ లో ప్రభాస్ చూపించిన వేరియేషన్స్.. ఇది మాత్రం ఈ మధ్య కాలంలో ఏ దర్శకుని సినిమాలో కూడా కనిపించనిది మారుతి సినిమాలో చూపించడం జరిగింది. దీనితో తన వరకు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ కాకపోవచ్చు.

Exit mobile version