
‘అద్వైతం’, ‘అమ్మపాట’ షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పేరు తెచ్చుకున్న ప్రదీప్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ తీసిన్ రెండి షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. వెండితెరపై తను చేసిన మొదటి ప్రయత్నం ‘మైనే ప్యార్ కియా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా విశేషాల గురించి చెబుతూ ‘నేను దేవకట్టా, చంద్రశేఖర్ యేలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. అప్పట్లో డిజిటల్ టెక్నాలజీ లేదు. అందుకే అద్వైతం రీల్ లో తీస్తే, అమ్మపాట డిజిటల్ లో తీశాను. నేను సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు అందరూ రొమాంటిక్ కామెడీ మూవీ ఆశిస్తున్నారని అర్థమైంది. అందుకే ప్రేమలోని స్వచ్ఛతని, ప్రేమ యొక్క విలువని చెప్పాలనుకున్నాను. 15 సంవత్సరాల క్రితం ప్రేమే జీవితం. తమ ప్రేమని బతికించుకోవడం కోసం ఏమన్నా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రేమంటే తమ స్వభావాన్ని బట్టి ఉంటోంది. అందుకే నేను ఈ సినిమా ద్వారా ఓ చిన్న మెసేజ్ ని పాస్ చేయాలనుకున్నాను. అదేమిటంటే ‘ఎవరూ ప్రేమ కోసం జీవితాన్ని వదులుకోకూడదు మరియు ఎవరూ రిలేషన్ షిప్స్ కి ఉన్న విలువని మరచిపోకూడదు’.అందుకోసమే ఇందులో రెండు లవ్ స్టోరీస్ ని చెప్పానని” ప్రదీప్ అన్నాడు.
ఇషా తల్వార్, మధుమిత, ప్రదీప్, సత్య దేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని సానా వెంకటరావు, ఉపేంద్ర కుమార్ కలిసి నిర్మించారు.

