పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. గత రెండు రోజులుగా దర్శకుడు సందీప్ వంగతో ప్రకాష్ రాజ్‌కు గొడవ జరిగిందని, అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
ఈ పుకార్లపై ప్రకాష్ రాజ్ తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్‌లో ఘాటుగా స్పందించారు. ‘విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి.. ‘స్పిరిట్’ (Spirit) సినిమా గురించి ఒక్క విషయం చెప్పాలి. అసలు నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగే ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ ‘వాట్సాప్ ఫ్యాక్టరీ’లో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి.. మీ పనులు మీరు చూసుకోండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈ స్పష్టతతో ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో ప్రకాష్ రాజ్ కొనసాగుతున్నారని తేలిపోయింది. ఈ చిత్రంలో ఆయన ప్రభాస్ తండ్రి పాత్రలో లేదా ఒక కీలకమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా మార్చి 2027లో విడుదల కానుంది.
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026
