‘గోవిందుడు అందరివాడెలే’ సినిమా ద్వారా ప్రకాష్ రాజ్ ఒక భారీ బ్రేక్ ఆశిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కి కొత్తగా ఇమేజ్ సంపాదించుకోవలసిన అవసరం లేకపోయినా ప్రస్తుతం అతనికున్న ఇమేజ్ టాలీవుడ్ లో కొన్ని కాంట్రవర్సీల ద్వారా దెబ్బతింటునట్టు సమాచారం
దీనికారణంగా ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఈ గొడవలన్నీ వదిలేసి ఫ్రెష్ గా ఒక ఇమేజ్ ని సంతరించుకోవాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో గోవిందుడి రూపంలో ఒక బ్లాక్ బస్టర్ పడడం ప్రకాష్ రాజ్ కు అత్యవసరం
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటనకు ఇప్పటికే కృష్ణవంశీ, రామ్ చరణ్ వంటి తదితరులు ప్రశంసించారు. మరి ప్రేక్షకులు సైతం ఆ లెవల్లో ప్రశంసిస్తారో లేదో చూడాలి
